2028లో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది.. మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 10 యేండ్లలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన మున్సిపాలిటీలను అభివృద్ది చేసుకున్నాం. బిఆర్ఎస్ హయంలో 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చాం.700 కోట్లతో నల్లగొండను అభివృద్ది చేసుకున్నామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతుంది. 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నియోజకవర్గంలో మున్సిపల్ ఉద్యోగులకు 4 నెలలగా జీతాలు రావడం లేదు. సూర్యాపేట మున్సిపల్ ఛైర్మెన్ జనరల్ స్థానంలో దళిత బిడ్డకు అవకాశం ఇచ్చాం. టకీ టకీమని డిల్లీలో పైసలు పడుతున్నాయి తప్పా.. రైతుల అకౌంట్స్ లో మాత్రం పడడంలేదు. పదవి కాలం ముగిసిన మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ చైర్మన్ లు ప్రజల్లోనే ఉంటే తిరిగి ప్రజలే గెలిపిస్తారని తెలిపారు.