విద్య పై చేసేది ఖర్చు కాదు.. భవిష్యత్ పెట్టుబడి : సీఎం రేవంత్ రెడ్డి

-

విద్య పై చేసేది ఖర్చు కాదు.. భవిష్యత్ పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొగిలిగిద్ద బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ లో రూ.21వేల కోట్లు విద్యాశాఖ కోసం కేటాయించినట్టు తెలిపారు. మొగిలిగిద్దకు దాదాపు రూ.16కోట్లు నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మా ప్రభుత్వం టీచర్ల బదిలీలు, ప్రమోషన్లను విధానం చేపట్టింది. గత ప్రభుత్వ విద్యాశాఖను నిర్వీర్యం చేసింది.

గత ప్రభుత్వం అధ్యాపకులు, వైస్ ఛాన్స్ లర్లను నియమించలేదు. గత పదేళ్లు విద్యాశాఖను నిర్వీర్యం చేశారు. మా ప్రభుత్వం 11వేల టీచర్ల నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. మా ప్రభుత్వం కేవలం 55 రోజుల్లో డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి చేసింది. గత ప్రభుత్వంలో సంవత్సరాల కొద్ది పరీక్షలు జరిగేవి కాదన్నారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచామని.. రూ.21వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news