వైసీపీ హయాంలో స్థానిక సంస్థల్లో తగ్గిన బీసీ కోటా రిజర్వేషన్ పునరుదమద్దరించేలా చట్టపరమైన అంశాలు పరిశీలించాలన్నారు సీఎం చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వం లో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని.. మహానాడు తర్వాత రాష్ట్ర, కేంద్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల Frbm లిమిట్ సున్నా అయిందన్న చంద్రబాబు.. గత ఎనిమిది నెలల్లో రాష్ట్రానికి ఆరున్నర లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినా, ప్రజల్లోకి విషయాన్ని తీసుకెళ్లటంతో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసారు.
ఇక 2014-19మధ్య జరిగిన తప్పిదాలు పునరావృతం కాకూడదన్న చంద్రబాబు.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ఈ ఏడాదే ప్రారంభించాలన్నారు. అన్నదాత సుఖీభవ కేంద్రం 6వేలే ఇచ్చినా మిగిలిన 14వేలు రాష్ట్ర ప్రభుత్వమే భరించి 3విడతల్లో రూ.20వేలు చెల్లిద్దామన్న చంద్రబాబు.. రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలు అన్వేషిస్తున్నానన్నారు. బనకచర్ల ప్రాజెక్టు నిధులు పీపీపీ మోడల్ లో రాష్ట్ర ప్రభుత్వం50 శాతం కాంట్రాక్టర్లు 50 శాతం పెట్టుకునేలా ప్రణాళికలు చేద్దామన్న సీఎం.. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే 50శాతం నిధుల్లో సగమైనా కేంద్రాన్ని అడుగుదామన్నారు చంద్రబబు .