విజయసాయిరెడ్డికి బిగ్ రిలీఫ్… విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి !

-

Court permission for Vijayasai Reddy to go abroad: విజయసాయిరెడ్డికి బిగ్‌ రిలీఫ్‌ దక్కింది. విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లడానికి హైదరాబాద్ సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 మధ్య 15 రోజులపాటు ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌, నార్వే వెళ్లేందుకు అనుమతి తెలిపింది.

Court permission for Vijayasai Reddy to go abroad

అయితే జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న ఆయన విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. దీనిపై తాజాగా విచారణ జరిపిన సీబీఐ కోర్టు.. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది.

ఇక అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి పంపించాను అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 2029 ఎన్నికల్లో శ్రీ వైయస్ జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని తెలిపారు. నా రాజకీయ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా అంటూ వివరించారు. శత్రుత్వాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో నా మరో ప్రస్థానాన్ని ప్రారంభించానని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news