నిర్మలమ్మకు పూజలు చేసిన ఇన్వెస్టర్.. వీడియో వైరల్

-

నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఓ ఇన్వెస్టర్ ప్రత్యేకంగా పూజలు చేశాడు. బడ్జెట్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు ఈసారి పెద్ద ఎత్తున సబ్సిడీలు వస్తాయని ఊహగానాలు ఊపందుకున్న తరుణంలో స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అవ్వాలని కోరుతూ ఓ ఇన్వెస్టర్ నిర్మలా ఫోటోకు అగరబత్తిస్‌తో హారతి ఇస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.


ఇదిలాఉండగా, ఇప్పటివరక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉన్నట్లు తెలుస్తోంది.వేతన జీవులకు ఎట్టకేలకు కేంద్రం శుభవార్త చెప్పింది. రూ.12 లక్షల వరకు టాక్స్ మినహాయింపు ఇచ్చింది. అంతేకాకుండా ఎంఎస్ఎంఈలకు కూడా శుభవార్త చెప్పింది. చిన్న వ్యాపారులకు సైతం రుణ పరిమితిని పెంచుతున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news