ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కీలక ఆదేశాలు జారీ

-

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ వాట్సాప్ ఆధారిత సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం విధితమే. ఈ క్రమంలో ఆర్టీసీ బస్ టికెట్లను వాట్సాప్ ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. 

దూర ప్రాంత బస్సు సర్వీసులన్నింటిలో వాట్సాప్ ద్వారా టికెట్ల బుకింగ్ కు అవకాశం కల్పించారు. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల అధికారులు, డిపో మేనేజర్లకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. వాట్సాప్ ద్వారా బస్సు టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే వినియోగదారులు వాట్సాప్ 9552300009 నెంబర్ కు ముందుగా హాయ్ అని మెసెజ్ పంపించాలి. తరువాత అందుబాటులో ఉన్న సేవల జాబితా కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news