బీసీ రాజకీయ యుద్ధభేరి సభలో MLC తీన్మార్ మల్లన్న కీలక కామెంట్స్ చేసారు. బీసీలు తెలంగాణ ఓనర్లు. ఏడాదికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీలు రాష్ట్ర ఎకానమీకి ఇస్తున్నాం. కానీ మనకు బడ్జెట్ లో 9వేల కోట్లు కేటాయించారు. పిరికెడు మందిలేని వారు 60మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక అలా ఉండొద్దు… నిన్నటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒకలెక్క. రెడ్లు, వెలమలు అసలు తెలంగాణ వారే కాదు. ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. ఇకపై రెడ్డి, వెలమలకు మాకు విడాకులే. దానికి ఈసభే వేదిక. బీసీలకు మీఓట్లు వద్దు.
బీసీల ఓట్లు మాకు వద్దని చెప్పే దమ్ము మీకుందా.. బీసీలకు బీఫామ్ లకు జరుగుతున్న యుద్ధం ఇది. తెలంగాణ రాష్ట్రం మీతాత జాగీరు కాదు… మీకు కౌలుకిచ్చినం. మీకౌలు అయిపోయింది.. 2028లో వచ్చేది బీసీల రాజ్యమే. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే. తెలంగాణలో EWS రిజర్వేషన్లు రద్దు చేయాలి, లేకుంటే ప్రభుత్వాన్నే రద్దు చేయాల్సిన పరిస్థితి కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీనే కొనేసే ఆర్థిక స్థోమత బీసీలకు ఉంది అని తీన్మార్ మల్లన్న అన్నారు.