సీపీఎం ఏపీ కార్యదర్శిగా శ్రీనివాసరావు తిరిగి ఎన్నిక

-

భారత కమ్యూనిస్టు మార్కిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా తిరిగి వి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. నెల్లూరులో 27వ ఏపీ రాష్ట్ర మహాసభలలో నూతన రాష్ట్ర కార్యదర్శిగా వి. శ్రీనివాస్ రావు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక 49 మందితో కూడిన నూతన రాష్ట్ర కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మరోవైపు 15 మందితో నూతన కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నారు.

రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా వెంకటేశ్వరరావు, బాబురావు, ప్రభాకర్ రెడ్డి, రమాదేవి, తులసీదాస్, వెంకటేశ్వర్లు, లోకనాథం, సురేంద్ర, సుబ్బరావమ్మ, రాంభూపాల్, ఉమా మహేశ్వర్ రావు, బలరాం, మూలం రమేష్, ఏవీ నాగేశ్వరరావులను ఎంపిక చేశారు. వీరిలో ఏవీ నాగేశ్వరరావు, బి.బలరాంను కొత్తగా కార్యదర్శిగా వర్గంలోకి తీసుకున్నారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించే పార్టీగా ఉన్న సీపీఎం.. తన ప్రజా సంఘాలతో మరింత ఉధృతంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధం అవుతోంది. 

Read more RELATED
Recommended to you

Latest news