కృష్ణ ప్రసాద్ డెడ్ బాడీ కి పోస్టుమార్టం పూర్తి..!

-

ఇవాళ ఉదయం గోవాలోని సీయోలిమ్‌ లో తను ఉంటున్న ఇంట్లో కృష్ణ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కృష్ణ ప్రసాద్ డెడ్ బాడీని గోవా ప్రభుత్వ ఆసుపత్రి మరియు బాంబోలిం ఆస్పత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు గోవా పోలీసులు. కృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులకు ఆత్మహత్యకు సంబంధించిన సమాచారం అందించారు గోవాలోని సియోలిం. అయితే తాజాగా కృష్ణ ప్రసాద్ డెడ్ బాడీ కి పోస్టుమార్టం పూర్తి అయ్యింది. కాబట్టి కృష్ణ ప్రసాద్ డెడ్‌ బాడీని తీసుకెళ్ళాల్సిందిగా అతని కుటుంబ సభ్యులకు చెప్పారు సియోలిమ్ పోలీసులు.

అయితే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి బయటికి వచ్చినప్పటి నుండి తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కృష్ణ ప్రసాద్.. ఈ కేసులో అరెస్టు అయినప్పటి నుండి డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఎడ్విన్ తో విభేధాలు వచ్చాయి. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత గోవాకి వెళ్లి అక్కడే స్థిరపడిపోయిన కృష్ణ ప్రసాద్.. గోవాలోని ఓ క్లబ్ ను నడుపుతున్నాడు. క్లబ్ మెయింటెనెన్స్ ఫారం మీద పడడంతో ఆర్థికంగా తట్టుకోలేకపోయిన కృష్ణ ప్రసాద్.. ఇవాళ ఉదయం తన వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ మెసేజ్ చేసి చనిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news