ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉదయం పూట ఐదు, ఆరు గంటలకి పింఛన్లను పంపిణీ చేయడం ప్రారంభించాల్సిన అవసరం అసలు లేదంటూ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ విషయం పైన ఉద్యోగస్తులకు షోకాజ్ నోటీసులు రావడంతో ఆయన ఈ విషయం పైన స్పందించారు.
అనవసర నిబంధనలతో ఇబ్బంది పెట్టవద్దని, ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 గంటలకు పంపిణీ చేస్తే సరిపోతుందని వెల్లడించారు. ఇంటి వద్ద కాకుండా ఇతర ప్రాంతాలలో పెన్షన్ పంపిణీ చేసినట్లయితే దానికి గల కారణాలను తెలుసుకోవాలని అన్నాడు. లబ్ధిదారులతో గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరాడు.