ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్.. బస్సు మీదకు ఎక్కిన మహిళలు

-

సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం కాస్త మహిళలకు భారంగా మారినట్లు తెలుస్తోంది. మొన్నటివరకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించిన వారు ప్రస్తుతం రష్ ఎక్కవ కావడంతో సీట్లు దొరక్క ఏకంగా బస్సు మీదకు ఎక్కి మరీ ప్రయాణం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకురావడంతో పురుషులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులో ఎక్కడ చూసినా ఆడవాళ్లే కనిపిస్తున్నారు. ఫలితంగా మేము డబ్బులిచ్చి టికెట్లు కొని ఎందుకు నిలబడి ప్రయాణం చేయాలని కండక్టర్, డ్రైవర్‌తో పురుష ప్యాసింజర్స్ వాగ్వాదానికి దిగుతున్నారు. అయితే, కొన్ని రూట్లలో బస్సులు పరిమితంగా నడుస్తుండటంతో ఈ దుస్థితి నెలకొందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news