అసెంబ్లీలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీరియస్ అయ్యారు. కులగణన ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చ సందర్భంగా సభలో పాటించాల్సిన వ్యూహాలపై బీజేఎల్పీ ఆఫీసులో నేడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం పాయల్ శంకర్ మాట్లాడుతూ..సభలో కాంగ్రెస్ తీరు అత్యంత దుర్మార్గంగా ఉందన్నారు.ఎవరి అభిప్రాయాలు, సంప్రదింపులు లేకుండానే కేబినెట్ మీటింగ్ పేరుతో సభను వాయిదా వేయడం బాధాకరమన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.సభా మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. సభా సమయాన్ని వృథా చేయడం మంచి సంప్రదాయం కాదన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో సమగ్రంగా చర్చ జరగాలని అన్నారు.రాష్ట్రంలోని బీసీలకు, ఎస్సీలకు మేలు జరగాలన్నదే బీజేపీ ఆకాంక్ష అని కోరారు.