మనుషులు అందరూ బాగుండాలని శ్రీ మహావిష్ణువు గరుడ పురాణాన్ని తెలిపారని హిందువులు నమ్ముతారు. అయితే శ్రీ మహావిష్ణువు ప్రత్యకించి గరుడ పురాణం చెప్పగా దీనిలో జ్ఞానం, మతం,యాగం, తపస్సు, రహస్యం, విధానం మరియు ఇతర ప్రపంచం గురించి ఎంతో వివరంగా చెప్పడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని భావిస్తారు కానీ దానికి అనే పద్ధతులని పాటించడం జరుగుతుంది. మీరు సంతోషంగా ఉండాలి అంటే తప్పకుండా గరుడ పురాణం ప్రకారం చెప్పిన ఈ పనుల ను మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయాలి.
వీటిని మధ్యలో వదిలేయడం వలన ఎంతో నష్టం కలుగుతుంది అని గరుడ పురాణం చెబుతోంది. కనుక ఈ పొరపాట్లను ఎలాంటి పరిస్థితుల్లో చేయకండి. చాలామంది ఎన్నో కారణాల వలన శత్రువులను పెంచుకుంటారు. అయితే శత్రుత్వాన్ని సరైన విధంగా ముగించకపోతే భవిష్యత్తులో ఎంతో నష్టం వస్తుంది. అంతేకాక శత్రువు తిరిగి హాని చేయడానికి కూడా ప్రయత్నించవచ్చు. అందుకే శత్రుత్వాన్ని ఎంతో త్వరగా ముగించుకోవాలి అని గరుడ పురాణం చెబుతోంది. చాలా మంది ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొన్ని రకాల మందులను వాడుతూ ఉంటారు. అయితే మందులను ఉపయోగించిన తర్వాత ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. కానీ అనారోగ్య సమస్య తగ్గిపోయిందని మధ్యలోనే మందులని ఉపయోగించడం ఆపకూడదు.
కొంతమంది మంటను వెలిగించిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా కాకుండా మంట వెలిగిస్తే అది ఆరిపోయే వరకు అక్కడే ఉండాలి, లేకపోతే ఎలాంటి ప్రమాదమైన సంఘటన అయినా జరగవచ్చు. కాబట్టి ఎప్పుడూ మంటని మధ్యలో వదిలేయకూడదు. చాలా శాతం మంది డబ్బులు లేని సమయంలో అప్పును తీసుకుంటూ ఉంటారు. ఇది ఎంతో సహజం అయినా సరే కొంతమంది ఆలస్యం చేస్తూ వడ్డీను పెంచుకుంటారు. ఈ విధంగా అప్పుని తీర్చకుండా ఎక్కువ రోజులు పాటు ఉండడం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక అప్పు చెల్లించడాన్ని కూడా మధ్యలో వదిలేయకూడదు అని గరుడ పురాణం చెబుతోంది.