అసెంబ్లీలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన సర్వే నివేదికలో కొత్త పదం రాశారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. తాజాగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. రాజకీయంగా తప్పించుకునే ప్రయత్నం చేయకండి. కామారెడ్డి డిక్లరేషన్ గురించి విని సంతోష పడ్డాం.. కానీ సర్వే చూసి బాధపడుతున్నాం. బీసీలకు అన్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ వస్తే.. బీసీలకు న్యాయం జరిగిందని ఆశ పడ్డాం. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఉంటారా..? అని ప్రశ్నించారు. ఈ రిపోర్టుతో బీసీలకు న్యాయం జరుగుతుందా..? అని ప్రశ్నించారు. ఈ నివేదిక పై సాధారణ వ్యక్తి కోర్టులో కేసు వేస్తే.. వారం రోజుల్లోనే కులగణన సర్వేను కొట్టివేస్తారని తెలిపారు. ఒక బీసీనీ ప్రధానమంత్రిగా చేసింది బీజేపీ అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ముందు ఉన్నది బీసీలే అన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం జనాభాను తగ్గించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.