మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో నీళ్ళు లేక బయన్న వాగు ఎండిపోయింది.దీంతో వ్యవసాయానికి నీళ్లు రావడం లేదని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.గ త ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు మే నెలలో కూడా నిండుగా నీళ్ళు ఉండేవని..
ఇప్పుడు బయన్న వాగులో నీళ్లే లేక పంటలు ఎండిపోతున్నాయని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది.
పాలకుర్తి నియోజకవర్గంలో నీళ్లకు కరువు ఏర్పడిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఎన్నిమార్లు విన్నవించినా, కలిసి ఆవేదన చెప్పుకున్నా కూడా పట్టించుకోలేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎంతో కష్టపడి బంగారం తాకట్టు పెట్టి పెట్టుబడులు పెట్టినా నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే బయన్న వాగులోకి నీళ్ళు వదిలి తాము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాకుండా ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గంలో నీళ్లకు కరువు
మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కలిసి ఆవేదన చెప్పుకున్నా కూడా పట్టించుకోలేదు అంటూ రైతుల ఆవేదన
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో నీళ్ళు లేక ఎండిపోయిన బయన్న వాగు
కేసీఆర్ ఉన్నప్పుడు మే నెలలో… pic.twitter.com/ZbtPVhAfrf
— Telugu Scribe (@TeluguScribe) February 5, 2025