ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులపై సీతక్క కీలక ప్రకటన చేశారు. 10 ఏళ్లలో ప్రజలకు ఇల్లు ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు… అందుకే ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నారని చెప్పారు. ప్రభుత్వ పథకాలు నిరంతర ప్రక్రియ.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు మంత్రి సీతక్క.
సమగ్ర సర్వే KCR వాళ్ళ కుటుంబం కోసం చేసుకున్నారు.. లిమ్కా బుక్ కోసం చేశారు అని మంత్రి సీతక్క అన్నారు. కానీ కుల గణన అనేది రాహుల్ గాంధీ డ్రీమ్. మేము రోజుకు పది కుటుంబాలే సర్వే చేశాం. కానీ కేసీఆర్.. ఒకే రోజు సర్వే చేశారు. ఇక బీసీలకు వచ్చే అవకాశాలు పక్కదారి పట్టించే పనిలో ఉన్నారు. BRS వాళ్ళు ఇచ్చింది 51 శాతం.. మేము ఇచ్చింది 56 శాతం BCలకు ఇచ్చాం అన్నారు.