ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేకే సంచలన సర్వే…!

-

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఈ క్రమంలో వివిధ సర్వే సంస్థలు తమ అంచనాలను ప్రకటించాయి. దాదాపు అన్ని సర్వే సంస్థలు బిజెపికే అధికారమని అంచనా వేశాయి. కానీ ఒక్క సర్వే మాత్రం మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని అంచనా వేసింది. కేకే ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి 39 సీట్లు, బిజెపికి 22 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది.

ఇక ఏబిపి మ్యాట్రిక్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఆప్ 32 – 37, బిజెపి 35 – 40, కాంగ్రెస్ ఒక్క సీటు గెలుస్తుందని పేర్కొంది. ఇక ఆపరేషన్ చాణక్య సర్వే సంస్థ ప్రకారం.. ఆప్ 22 – 25, బిజెపి 22-25, కాంగ్రెస్ 6 – 7 అని అంచనా వేసింది. ఇక ఢిల్లీలో సుదీర్ఘకాలం తర్వాత బిజెపి అధికారం చేపట్టబోతుందని పీపుల్స్ పల్స్ – కోడిమో సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలలో వెల్లడించాయి.

ఢిల్లీ ప్రజలు ఈసారి డబల్ ఇంజన్ సర్కారు వైపు నిలిచారని ప్రకటించింది. ఈ సర్వే ప్రకారం బిజెపి 51-60, ఆమ్ ఆద్మీ పార్టీ 10 – 19, కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా లభించకపోవచ్చునని అంచనా వేసింది. చాలా సర్వే సంస్థలు బిజెపి అధికారాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేయగా.. కేకే సర్వే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేపడుతుందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఎన్నికల వేల కేకే సర్వే అర్చన వేసిన సీట్లే తుది ఫలితాలకు మ్యాచ్ కావడంతో.. ఈ సర్వేపై భారీ అంచనాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news