తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తమిళనాడు లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున 13 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ తరుణంలోనే గర్భం దాల్చింది 13 ఏళ్ల బాలిక. ఇక ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేని అసహాయతలో బాలిక తల్లి ఉండిపోయింది. నెల రోజుల పాటు స్కూలుకు సెలవు పెట్టించి అబార్షన్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో వెలుగులోకి ఈ దారుణ సంఘటన తెరపైకి వచ్చింది.
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పోచంపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇక ఈ సంఘటనలో ముగ్గురు కామాంధులపై పోక్సో కేసు నమోదు అయింది. వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. అటు ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. మహిళలకు, ఆడపిల్లలకు తమిళనాడులో రక్షణ లేదంటూ బిజెపి అధ్యక్షుడు అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ఘటనలతో స్టాలిన్ సర్కారుకు మరింత సెగ తగిలింది.