గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ గుర్తు మీద గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిపై వేటు పడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారికి నోటీసులు ఇవ్వాలనిఇటీవల అసెంబ్లీ స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మందికి నోటీసులు జారీ చేశారు. తాజాగా ఢిల్లీ నుంచి కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసుల విషయంపై మా న్యాయవాదులను నేడు కలిశాను. ఈ ప్రక్రియను ఇంకా త్వరగా చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయి. ఏ విధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటుపడుతుందో ఆ మార్గాలను చూస్తామని కేటీఆర్ వెల్లడించారు.
పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వారి అనర్హత విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసుల విషయంపై మా న్యాయవాదులను ఇవాళ కలుస్తున్నాము
దీన్ని ఇంకా త్వరగా చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయి.. ఏ విధంగా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటుపడాలని చర్చిస్తాం – కేటీఆర్ pic.twitter.com/n1zoUGNmoS
— Telugu Scribe (@TeluguScribe) February 6, 2025