భయపడకండి.. అంతా నేను చూసుకుంటా.. కే.ఏ.పాల్ భరోసా

-

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం పాల్ మీడియాతో మాట్లాడారు. తాను భారతీయుల కోసం నేను ఏమైనా చేస్తాను.. ఎవ్వరితో పెట్టుకున్నా ట్రంప్ భారతీయులతో పెట్టుకోవద్దు. ట్రంప్ నాకు మిత్రుడు కాబట్టి ముందు సూచన చేస్తున్నా అని కే.ఏ.పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనదేశ పౌరులకు ట్రంప్ బేడీలు వేస్తుంటే.. మోడీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

KA Paul
KA Paul

ఆ విధంగా వారిని చూడటానికి వారు ఉగ్రవాదులా..? రేపిస్టులా..? అని పేర్కొన్నారు. దమ్ముంటే మోడీ అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాలని.. విదేశాంగ మంత్రి జయశంకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. చైనాను ఎదురించడానికి అమెరికాకు మన సహకారం చాలా అవసరం అని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు మోడీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు తెగ పొగుడుతున్నారని విమర్శించారు. అమెరికాలో ఇంత జరుగుతుంటే మన ఎంపీలు ఏం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అమెరికాలో ఇబ్బందులు పడుతున్న భారతీయులంతా కే.ఏ.పాల్ వెబ్ సైట్ ను సంప్రదించండి అని పిలుపునిచ్చారు. అమెరికాలో భారతీయులకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది అని హామి ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news