మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయంటూ బాంబ్ పేల్చారు రాహుల్ గాంధీ. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని మార్చారని మండిపడ్డారు రాహుల్ గాంధీ. మహారాష్ట్రలో ఐదేళ్లలో 32 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారని ఆగ్రహించారు. మహారాష్ట్రలో లోక్‌సభ – అసెంబ్లీ ఎన్నికల మధ్య సమయంలో 39 లక్షల కొత్త ఓటర్లు చేరారని ఆరోపణలు చేశారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/Rahul-Gandhi-1.jpg)
ఈ 39 లక్షల మంది కొత్త ఓటర్లు ఎవరు? అంటూ నిలదీశారు. ఇది హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్యతో సమానం అన్నారు రాహుల్ గాంధీ. కొత్తగా చేరిన ఓట్లే ఆ కూటమి పార్టీలకు విజయాన్ని అందించాయని తెలిపారు రాహుల్ గాంధీ. మాకు ఓటర్ల జాబితా, వారి ఫొటోలు, చిరునామాలు అందించాలని ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేస్తున్నామని ఆగ్రహించారు. పార్లమెంట్‌లో ఈ అంశాన్ని నేను లేవనెత్తినప్పటికీ ఈసీ నుంచి సమాధానం రాలేదని ప్రశ్నించారు.