తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో.. ఉండకూడదు అనే విషయంలో అధిష్ఠానానిదే నిర్ణయం. నేను ఎవరిని సిఫార్సు చేయడం లేదు. అలాగే ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళతాం. అర్జెంట్ గా అరెస్ట్ చేయించి జైల్లో వేయాలనే ఆలోచన నాకు లేదు అని సీఎం తెలిపారు.
ఇక రాష్ట్రంలో సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పని చేస్తున్నాము. కులగణన ఆషామాషీగా చేసింది కాదు.. ఎంతో పక్డబందిగా చేసాం. బిసిలు ఐదున్నర శాతం పెరిగారు. అలాగే మా సర్వేతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దక్కుతుంది. అదే విధంగా ప్చ్చ్ కార్యవర్గం కూర్పు కొలిక్కి వచ్చింది.. ఒకటి రెండు రోజుల్లో ప్రకటన ఉంటుంది. ఇక నేను ఢిల్లీలో ఉన్నా.. రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరలేదు. అంతే కానీ నాకు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ లేదు. మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది అని రేవంత్ రెడ్డి తెలిపారు.