మీ సేవా దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ కొత్త డ్రామాలు చేస్తోందని.. ఇది దగా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. దరఖాస్తుల పేరిట ఇంకెన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారు రేవంత్ రెడ్డి? అంటూ మండిపడ్డారు. ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నారు…. కుల గణనలో వివరాలు తీసుకున్నారని ఆగ్రహించారు. గ్రామ సభల పేరిట డ్రామా చేశారని… ఇప్పుడు మల్లా మీసేవలో దరఖాస్తులు అంటున్నారని ఫైర్ అయ్యారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/harish-rao.jpg)
పథకాల పేరిట ఇన్నాళ్లు మీరు చేసిన హడావుడి స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేసిన గారడీ నేనా? ప్రజా పాలన, గ్రామ సభల దరఖాస్తులకు విలువ లేదా? అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో దరఖాస్తు లేకుండా, దస్త్రం లేకుండా తెలంగాణలో పథకాల అమలు జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు అంటూ మోసం చేస్తున్నారు.జనాల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.
పేదలకు రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందించాలనే ఆలోచన కంటే, కోతలు పెట్టి ఎలా అందకుండా చేయలన్న దానిపైనే మీ ప్రభుత్వ దృష్టి ఉందన్నారు. దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, 14 నెలల పాలనలో మీరు చేసిందేముందని… దరఖాస్తుల పేరిట కాలం వెళ్లదీయడం మానేసి, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయండని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు, ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేసి, నిరుపేదలకు, రైతులకు బాసటగా నిలవండని తెలిపారు.