అవినీతికి చిరునామా కేజ్రీవాల్.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  27 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత బీజేపీ ఘన విజయం సాధించింది. 70 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ 48 అసెంబ్లీ స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఆప్ 22 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ మాత్రం ఖాతా కూడా తెరవలేదు. దీంతో దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. డిల్లీలో బీజేపీ విజయం పై తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆప్, కాంగ్రెస్ పార్టీలపై సంచలన కామెంట్స్ చేశారు.

దాదాపు పన్నెండేళ్లుగా ఢిల్లీకి పట్టిన కేజ్రీవాల్ గ్రహణం వీడిందని విమర్శించారు. 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతుందని.. ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అని కిషన్ రెడ్డి తెలిపారు. ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోనే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ పై వారి తీర్పును వెల్లడించారు. ఆప్ ఓటమిలో లిక్కర్ స్కామ్ దే ప్రధాన పాత్ర అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్.. చివరికీ ఆయనే అవినీతికి చిరునామాగా మారిపోయారని విమర్శించారు. 

Read more RELATED
Recommended to you

Latest news