జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న కారు ముందు టైర్ బ్లాస్ట్ అవ్వడంతో ఒక్కసారిగా అదుపుతప్పిన వాహనం బోల్తా కొట్టింది. అంతటితో ఆగకుండా గాల్లో 8 పల్టీలు కొట్టింది. ఈ విజువల్స్ హైవే పక్కన అమర్చిన సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి.
ఈ ఘోర ప్రమాదం ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ హైవేపై చోటుచేసుకుంది. ఒక్కసారిగా కారు టైరు పేలడంతో డ్రైవర్ వెహికల్ మీద పట్టుకోల్పోయాడు. ఫలితంగా కారు పల్టీలు కొడుతూ వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఓ ప్రయాణికుడు కొన్ని మీటర్లు గాల్లోకి ఎగిరి కిందపడ్డాడు. అంతేకాకుండా అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు కేవలం గాయాలతో బతికి బయటపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
హైవేపై 8 పల్టీలు కొట్టిన కారు..
యూపీలోని పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవేపై కారు టైరు పేలి అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టి 8 పల్టీలు కొట్టింది. అందులోని ఓ ప్రయాణికుడు కొన్ని మీటర్లు గాల్లోకి ఎగిరి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో కా రులో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలు అయ్యాయి. pic.twitter.com/XjpqTZFLkZ
— ChotaNews App (@ChotaNewsApp) February 10, 2025