పృథ్వీరాజ్ కి బండ్ల గణేష్ వార్నింగ్.. ఇక నోరు మూసుకో..?

-

టాలీవడ్ సెన్షేషనల్ ప్రొడ్యూసర్ ప్రముఖ కమెడీయన్ బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. కమెడియన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత నిర్మాతగా మారిపోయారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇవాళ ట్వీట్స్ మీద ట్వీట్స్ వేసి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు బండ్ల గణేష్. ముందుగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తీన్మార్ మూవీ డబ్బింగ్ ఎందుకు ఓకే చేశావ్ అన్నా..  థియేటర్ లో అసలు డైలాగ్స్ కూడా వినిపించలేదు అని ఓ అభిమాని ట్వీట్ వేశారు. దీనిపై బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యాడు. ఓకే ఇప్పుడు మళ్లీ డబ్బింగ్ చేయించి.. మంచిగా మిక్సింగ్ చేసి రీ రిలీజ్ చేస్తాను అని మాటిచ్చాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా..? అంతా అనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే మరో ట్వీట్ చేశాడు. “రాజకీయం సినిమా రంగాలు ఒకటిగా చూడకూడదు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీ, నటులు సినిమా వేదికల పై రాజకీయాలు చేయకూడదు. ఇలాంటి వారి విషయం లో నిర్మాతలు జాగ్రత్త వహించాలి. నటించిన వారి నోటి దూలకు సినిమాలకు సమస్య రావడం దారుణం. సినిమా ను సినిమా గా చూడండి” అంటూ ట్వీట్ చేశాడు బండ్ల గణేష్.

Read more RELATED
Recommended to you

Latest news