లగచర్ల భూముల కోసం పోరాడిన జ్యోతి నాయక్ కు ఆడబిడ్డ పుట్టింది.. ఆ ఆడబిడ్డకు పేరు పెట్టమని నన్ను కోరింది. భూ పోరాటంలో పుట్టిన బిడ్డ కాబట్టి భూమి, ధాత్రి, అవని అని పేర్లు చెప్పా. తల్లిదండ్రులు జ్యోతి నాయక్, ప్రవీణ్ ఇద్దరు భూమి నాయక్ అని పేరు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అనంతరం కొడంగల్ లో జరుగుతున్న బీఆర్ఎస్ రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల కోసం పని చేయడం లేదని.. వారి భూములను ఎలా గుంజుకోవాలనే ఆలోచిస్తున్నారని తెలిపారు.
ఏడాదిగా రాష్ట్రంలో కౌరవ పాలన సాగుతోంది. కొడంగల్ లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది. రేవంత్ సోదరులు కొడంగల్ భూములపై కన్నేశారు. అధికారంలోకి వచ్చి 14 నెలలైనా కాంగ్రెస్ చేసింది ఏమి లేదని ఆయన ఫైర్ అయ్యారు.