రోజు రోజుకు టెక్నాలజీ చాలా వేగంగా పెరిగిపోతుంది. గతంలో ఐటీకి క్రేజీ ఉండేది.. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. టెక్నాలజీకి అనుగుణంగా మనలోకం న్యూస్ దూసుకెళ్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి వీడియో ప్రొడక్షన్ చేసేలా స్పార్క్ ఒరిజినల్స్ టూల్స్ డిజైన్ చేయడం జరిగింది. వాస్తవానికి ఒక వీడియోను తయారు చేయాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఎడిటింగ్ సాప్ట్ వేర్ తో చాలా వేగంగా తయారు చేయవచ్చు. దీనికి స్పార్క్ ఒరిజినల్స్ టూర్ ఏఐలో ప్రత్యేకత చాటుతోంది.
సాధారణంగా మనిషి యొక్క మేధస్సుకు ఏఐ క్రియేటివిటీని కలిపితే తయారయ్యే వీడియో క్వాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మరో లెవెల్ లో ఉంటుందని చెప్పవచ్చు. వాస్తవానికి వీడియో మేకింగ్ లో క్యారెక్టర్స్ లో ఏఐ అద్భుతంగా పని చేస్తోంది. ముఖ్యంగా యానిమేషన్స్, స్కెచ్ స్టైల్ విజువల్స్ కి క్రియేట్ చేయడంలో స్పార్క్ ఒరిజినల్స్ ఏఐ టూల్ ప్రత్యేకత అనే చెప్పవచ్చు.
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కథ చెప్పడం :
సాధారణంగా ఒక ఐడియాను తీసుకొని దానికి ఏఐని ఉపయోగింి వీడియోను తయారు చేయడం. వీడియోకు సంబంధించిన ఇన్ సైట్స్ ఇవ్వడం.
సీన్ ప్రోటో టైపింగ్ :
ఏదైనా వీడియో చేసే ముందు అందుకు తగినట్టుగా విజువల్స్, లైటింగ్, కంపోజిషన్ వంటి వాటిని సిద్ధంగా ఉంచడం ద్వారా సమయంతో పాటు ప్రొడక్షన్ కూడా ఆదా అవుతుంది.
పూర్తి స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ సపోర్ట్ :
స్క్రిప్ట్ నుంచి తెర పైకి వెళ్లేంత వరకు ప్రతీ అడుగులో గైడెన్స్ ఇస్తూ ప్రాజెక్టు చాలా సాఫీగా పూర్తి అయ్యేవిధంగా సహాయపడుతుంది స్పార్క్ ఒరిజినల్స్ టూల్.
B2B ఫోకస్ :
ఫిల్మ్ మేకర్స్, క్రియేటర్స్, అడ్వర్టయిజర్ల సహాకారంతో సినిమాల టీజర్లు, ట్రైలర్లు, చిన్న చిన్న వీడియోలు తయారు చేసే సామర్థ్యం ఏఐ టూల్ ప్రత్యేకత. అన్ని భాషల్లో కూడా వీడియోను తయారు చేయడం ఐఏ యొక్క గొప్పతనం అనే చెప్పాలి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, పంజాబీ, ఒడియా, బెంగాళీ, గుజరాతి, మరాఠీ వంటి ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లీషు, అరబిక్, స్పానిష్, ఫ్రెంచ్ భాషల్లో కంటెట్ ను సృష్టించడం ఈ టూల్ ప్రత్యేకత. అలాగే స్పోర్ట్స్, టెక్నాలజీ, ఎంటర్టైన్ మెంట్స్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, లైఫ్ స్టైల్ కి సంబంధించి వీడియోలను తయారు చేసే సామర్థం దీనికి ఉంది.
B2C ఫోకస్ :
బీ2సీ విభాగం విభిన్నమైన కంటెంట్ ను క్రియేట్ చేస్తుంది. ఏఐ ఆధారిత యానిమేషన్స్ నుంచి జీవం పోసుకున్న వీడియోల వరకు భిన్నమైన కంటెంట్ యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ వంటి సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకునేలా ఉంటుంది. ఇలాంటి కంటెంట్ కచ్చితంగా అందరినీ మెప్పిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
డిజిటల్ మీడియా మేళవింపుతో స్థానిక ప్రేక్షకుల నుంచి అంతర్జాతీయ ప్రేక్షకులకు వివిధ కథనాల ద్వారా అవగాహన కల్పించడం.. లోతైన వివరణ, విశ్లేషణలు అందించడమే లక్ష్యంగా ఈ టూల్ పని చేస్తుంది. ముఖ్యంగా నేరాలు, చారిత్రాత్మక ఘట్టాలు, శాస్త్రీయ ఆవిష్కరణలు, పర్యావరణ సమస్యల పై స్పార్క్ ఒరిజినల్స్ టూట్ ప్రత్యేకంగా కవర్ చేస్తుంది. మరీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా స్పార్క్ ఒరిజినల్స్ టూల్ గురించి తెలుసుకోండి.