శివరాత్రి పండుగ.. మంత్రి కొండా సురేఖ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల చివరలో శివరాత్రి ఉంది. అయితే… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అవసరమైన ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈఓలతో సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, భద్రకాళి తదితర దేవస్థానాల్లో అవసరమైన ఏర్పాట్లపై మంత్రి వివరించారు అధికారులు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/12/Untitled-1-45.jpg)
గత ఏడాది శివరాత్రి నిర్వహణా అనుభవాల ఆధారంగా ఈ ఏడాది చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ సూచనలు చేశారు. ప్రధానoగా క్యూ మేనేజ్ మెంట్, మంచి నీటి వసతి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్, ఆరుబయట ప్రదేశాల్లో విద్యుద్దీపాల ఏర్పాటు, చలువ పందిళ్ల(తడకలతో) ఏర్పాటు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారుల నుండి మంత్రి సురేఖ వివరాలు సేకరించారు. మహాశివరాత్రి నేపథ్యoలో శివాలయ క్షేత్రాలకి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పోలీస్ శాఖ సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఆయా దేవాలయాలున్న పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో స్థానిక, ఆంగ్ల భాషల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.