తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం ఉదయం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలిశారు. అనంతరం సీఎంతో కలిసి భేటీ అయ్యారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలులో భాగంగా విద్య, ఉద్యోగాల్లో మూడు గ్రూపులుగా వర్గీకరించబడిన ఎస్సీ ఉప కులాల రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికపై కీలక చర్చలు జరిపారు.
అయితే, దీనిపై మందకృష్ణ తన అభ్యంతరాలను సీఎం ముందు పెట్టారు. ఎస్సీ రిజర్వేషన్‌కు అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సానుకూలంగా ఉన్నామన్నారు.జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలోని లోపాల వలన మాదిగలు, మరికొన్ని ఉపకులాల హక్కులు, వాటా, అస్తిత్వం, భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని వెల్లడించారు. ఆ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ ముందు పలు ప్రతిపాదనలను మందకృష్ణ మాదిగ పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.