మధ్యప్రదేశ్ ప్రమాదం పై సీఎం రేవంత్ దిగ్బ్రాంతి.. అధికారులకు కీలక ఆదేశాలు

-

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ జిల్లా పరిధిలోని హైదరాబాద్ కి చెందిన బస్సు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగర పరిధిలోని నాచారం నుంచి కొంత మంది భక్తులు ప్రయాగ్ రాజ్ లో జరుగుతొన్న మహాకుంభమేళాకు మినీ బస్సులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో జబల్ పూర్ జిల్లా కేంద్రానికి 65కిమీ దూరంలో ఉన్న సిహోరా పట్టణ శివారులో ఆ మినీ బస్సును ఎదురుగా వన్ వేలో వస్తున్న ఓ ట్రక్కు బలంగా ఢీ కొట్టింది.

ఈ దుర్ఘటనలో బస్సులో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. తాజాగా ఈ ప్రమాదం పై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అదేవిధంగా సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news