పచ్చిమిర్చీ ఆరోగ్యానికి మంచిదే.. కానీ పడనివారు ఎండుమిర్చీని ఇలా వాడితే సరి..!

-

వండుకునే వంటలు చప్పగా చప్పగా ఉంటే బాగోదు.. లాలాజలం ఉత్పత్తి కాదు కాబట్టి కారం వేసేవారు. కారం అనేది.. సిక్రీషన్ కు బాగా ఉపయోగపడుతుంది. వంటల్లో పచ్చిమిరపకాయ వేస్తే చాలు.. లాలాజలం బాగా స్రవిస్తుంది. జీర్ణాదిరసం బాగా పెంచుతుంది. కారాన్ని మనం మూడు రకాలుగా ఉపయోగిస్తాం.. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కారం.. అయితే ఈ ముడింటిలో పచ్చిమరపకాయలు మంచివని వైద్యనిపుణులు అంటుంటారు. ఎందుకంటే.. వీటిల్లో కారం 50శాతమే ఉంటుంది. పండుమిరపకాయగా మారేకొద్ది అందులో ఘాటు మూడువంతులు పెరుగుతుంది. పండుమిరపకాయ ఎండేకొద్ది.. అందులో ఉండే నీటిశాతం తగ్గి..కారం ఘాటు 100శాతం అవుతుంది. కాబట్టి వంటల్లో కారం, ఎండుమిర్చి కంటే.. పచ్చిమిర్చిని వాడటం మంచిది..

అయితే కొంతమందికి కడుపులో మంటలు, ఇరిటేషన్స్, అల్సర్, ప్రేగుపూతలు ఉంటాయి. అలా ఉన్నవారికి వంటలో పచ్చిమిర్చి వాడితే..ఇంకాస్త మండుతుంది. మరి అలాంటి వారు..పచ్చిమిర్చిని మానేస్తారు. కానీ కారం లేకపోతే రుచిరాదు. ఇలాంటి వారి కోసం..పూర్వం రోజుల్లో ఏం చేసేవారంటే..తాలింపులో ఎండుమిరపను వేసి ఆ తర్వాత ఏరి బయటేస్తారు. అందులో ఉండే ఘాటు సగమే దిగుతుంది. ఇలా వాడుకుంటే..ఈ సమస్యలు ఉన్నవారికి మంచిది. ఎండుమిరపకాయను ఇలా వాడితే ఏం ఏం లాభాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం

100గ్రాముల ఎండుమిరపకాయల్లో ఉండే పోషకాలు

236కాలరీల శక్తి
పిండిపదార్ధాలు 30గ్రాములు
మాంసకృతులు13 గ్రాములు
కొవ్వు పదార్థాలు 6.5 గ్రాములు
పీచుపదార్థాలు 31 గ్రాములు
సూక్ష్మపోషకాలు తీసుకుంటే బీటాకెరోటిన్ 1542 మైక్రోగ్రామ్స్

ఎండుమిరపకాయలో ఉండే ఔషధగుణాలు

ఎండుమిరపకాయలో ఫెరూలిక్ యాసిడ్( Ferulic acid)అనేది బాగా ఉంటుంది. ఇది మన చర్మంలోపల పొరలో ఉండే కొలాజిన్, ఎలాస్టిన్ అనే బ్యాండ్స్ ఉంటాయి. స్కిన్ ఫోల్డ్స్ రాకుండా, స్ట్రెచ్ మారకుండా ఇవి కాపడతాయి. ఎప్పుడైతే ఇది తెగిపోతుంది..చర్మం ముడతలు పడటం స్టాట్ అవుతుంది. ఈ ఫెరూలిక్ యాసిడ్ అనేది..బ్యాండ్స్ పైన పనిచేసి..స్కిన్ ఫోల్డ్స్ రాకుండా కంట్రోల్ చేస్తుందని సైంటిఫిక్ గా ఇచ్చారు

కాప్సైసిన్( Capsaicin) అనే కెమికల్ ఎండిమిరపకాయలో ఉంటుంది. ఇది నాడీవ్యవస్థమీద పనిచేసి నొప్పి తెలియకుండా చేస్తుంది. దీని వల్ల ఇంకో లాభం ఏంటంటే..కొంతమందికి ఒబిసిటీ వల్ల అతిగా ఆకలివేస్తుంది. దాన్ని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. కణజాలంలో ఉండే మైటోకాండ్రియా ద్వారా ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అయ్యేట్లు చేసి ఫ్యాట్ బర్నింగ్ కు బాగా ఉపయోగపడుతుంది. కాలన్ కాన్సర్..మలం ప్రేగుకు సంబంధించిన క్యాన్సర్ రాకుండా..అందుకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేయడానికి ఈ కెమికల్ ఉపయోగపడుతున్నట్లు కూడా సైంటిఫిక్ నా నిరూపించారు.

ఎండుమిరపకాయలో ఉండే సినాపిక్ యాసిడ్( Sinapinic acid) అనేది మన కణజాలంలో ఉండే డీఎన్ఏ డామేజ్ ను కంట్రోల్ చేసి కణజాలం క్యాన్సర్ కణాలుగా మాడిఫై కాకుండా చక్కగా ఉపయోగపడుతుందట.

ఇంకా ఇందులో ఉంటే..వయోలాక్ జాంతిన్( Violaxantin) అనే కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుందంటే..క్యాన్సర్ వచ్చినవారికి క్యాన్సర్ కణాలు వాటంతట అవే చనిపోయేట్లు ఈ కెమికల్ పనిచేస్తుందట. కణాలు ఎక్కువ స్ప్రెడ్ అవకుండా ఇది డైరెక్షన్ ఇస్తుందట.

ఇన్ని లాభాలు ఉన్నాయని ఇప్పుడు సైంటిఫిక్ గా నిరూపించారు..కానీ బుుషులు ఇవన్నీ ఏనాడో తెలుసుకుని…వీటిని వంటలో వేసి తీసేప్రక్రియను మనకు అందించారు. కాబట్టి ఎర్రకారం వేసుకోవడం కంటే..ఇలా ఎండుమిరపకాయను తాలింపులో వాడుకుని తీసేయటం చాలా మంచిది. దీనికంటే పచ్చిమిర్చి తక్కువ ఘాటుతో డైజెషన్ అవుతుంది కాబట్టి నిత్యం వాడుకునేందుకు ప్రయత్నించండి..ఇది పడనివారు..ఎండుమిరపకాయను ఇలా వాడుకుంటే సరి.!

Read more RELATED
Recommended to you

Latest news