కార్యదర్శుల సమావేశంలోలో ఫైళ్లు క్లియరెన్స్ పైన అధికారులకు మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ పీకారు. ఫైళ్లు భారీగా పేరుకు పోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసారు. జలవనరుల శాఖలో ఒక్కో ఫైల్ క్లియరెన్స్ కు 50 రోజుల సమయం పడుతుంది. హోమ్ శాఖలో కీలక ఫైళ్ళ క్లియరెన్స్ కు 47 రోజుల సమయం.. సీఎంఓ ఐటి శాఖలో శాసన సభ వ్యవహారాలకు సంబంధించి సగటున 30 రోజుల సమయం.. కార్మిక శాఖలో 28 రోజులు.. పాఠశాల, విద్య శాఖలో 26 రోజులు.. ఆర్ధిక, అటవీ శాఖలో 9 రోజుల సమయం పడుతుంది.
ఇక రెవెన్యూశాఖలో 11 వేలపై చిలుకు ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయి. పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి లో 14 వేల ఫైళ్లు.. జలవనరుల శాఖలో 9 వేలు..హోమ్ శాఖలో 7400 ఫైళ్లు.. సాధారణ పరిపాలన శాఖలో సుమారు 12 వేల ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఈ స్థాయిలో ఫైళ్లు పెండింగ్ ఉండడంతో సీఎం చంద్రబబు అసహనం వ్యక్తం చేసారు.