మెగాస్టార్ చిరంజీవి పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. రామ్ చరణ్ కు కొడుకు మాత్రమే పుట్టాలని.. అసలు ఆడవాళ్లు పుట్టకూడదని… తాజాగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలు… సోషల్ మీడియాలో కాక పుట్టిస్తున్నాయి. దీంతో మెగాస్టార్ చిరంజీవి పై… మహిళా సంఘాలు అలాగే నేటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/08/Megastar-Chiranjeevi-in-Tirumala-today.webp)
2025 సంవత్సరంలో కూడా పురుషాధిపత్యం కావాలని… మెగాస్టార్ చిరంజీవి కోరుకోవడం దారుణ అంటూ మండిపడుతున్నారు. దీనిపై వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. కాగా, తాజాగా ఓ సినిమా ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. తన ఇల్లంతా మనవరాళ్లతో నిండిపోయిందని… ఇంట్లో ఉన్నప్పుడు అలా తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్ లా ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి బాంబు పేల్చారు. ఒక అబ్బాయిని కనురా అంటూ రామ్ చరణ్ ను ప్రతిసారి అడుగుతానని… కానీ మళ్లీ వాళ్లకు ఆడపిల్ల పుడుతుందని భయపడుతున్నట్లు తెలిపారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.