థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. జీవన విధానం, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్లు వలన థైరాయిడ్ సమస్య ఎక్కువ అవుతుంది అనే చెప్పవచ్చు. పైగా దీని వలన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. జీవన విధానంతో పాటుగా తీసుకునే ఆహార పదార్థాల ద్వారా హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.
థైరాయిడ్ తో భాధపడేవారు ధనియాలు తీసుకుంటే సమస్య తీవ్రత ఎంతో తగ్గుతుంది. వీటిలో ఉండే విటమిన్లు థైరాయిడ్ తీవ్రతని తగ్గిస్తాయి మరియు టీ4 ను టీ3 గా మార్చగలదు. అంతేకాకుండా కాలేయ ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో సహాయ పడతాయి. థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటే విటమిన్ సి ను తప్పకుండా తీసుకోవాలి. విటమిన్ సి ను ప్రతి రోజు డైట్ లో భాగంగా తీసుకోవడం వలన ఎన్నో లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యతో పాటుగా రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. సహజంగా కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను కొంత మంది తీసుకుంటారు కానీ గుమ్మడి గింజలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోరు.
కాకపోతే గుమ్మడి గింజల్లో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి. వీటిలో ఉండే జింక్ శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ను ఉత్పత్తి చేయడానికి మరియు నియంత్రణ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కనుక ప్రతిరోజు గుమ్మడి గింజలను తప్పకుండా తీసుకోండి. థైరాయిడ్ సమస్య తీవ్రతను తగ్గించుకోవాలి అంటే బెర్రీస్ ను తీసుకోవచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీంతో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. థైరాయిడ్ సమస్య వున్నా వారికి పెసళ్లు చాలా సహాయం చేస్తాయి అనే చెప్పవచ్చు. కనుక ఇటువంటి ఆహార పదార్థాలను ప్రతి రోజు మీ డైట్ లో భాగంగా తీసుకోవడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది మరియు థైరాయిడ్ సమస్యను చెక్ పెట్టవచ్చు.