తెలంగాణ ప్రభుత్వం గూగుల్ తో కీలక ఒప్పందం

-

తెలంగాణ రైజింగ్ పేరుతో పెట్టుబడుల సాధన దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయాణంలో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ లో ఏఐ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించిన గూగుల్  ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. టీ హబ్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుల సమక్షంలో గూగుల్ సంస్థ ప్రతినిధులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. కృత్రిమ మేధ అంకుర పరిశ్రమలకు గుగూల్ తోడ్పాటునందించనుంది. వ్యవసాయం, విద్య, రవాణ రంగం, ప్రభుత్వ డిజిటల్ కార్యకలాపాలకు గూగుల్ ఏఐ కేంద్రం సహకరిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఇదే రోజున మైక్రోసాఫ్ట్ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు ఎంవోయూ అగ్రిమెంట్ చేసుకుంది. దీంతో మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి. ఇది యువతకు మరింత సాధికారత కల్పిస్తుందని సీఎం రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని.. మైక్రోసాఫ్ట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో తెలంగాణ, మైక్రోసాఫ్ట్ 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెట్టడంతో పాటు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం ఇంటెలిజెన్స్ ను ఉపయోగించనున్నట్లు ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news