సాగు నీటి విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!

-

రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, పంటలకు సాగు నీటి విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్​ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీతో పాటు ప్రధాన ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు, నీటి వినియోగం వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని, సాగు నీటికి తాగునీటికి ఎక్కడా ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.

రాబోయే మూడు నెలలు అత్యంత కీలకమని, రాష్ట్రమంతటా అన్ని ప్రాంతాల్లో సాగు తాగు నీరు. విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని సీఎం అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా తాగు నీరు, సాగునీటిని అందించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని సీఎం ఆదేశించారు. వెంటనే సంబంధిత అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని జిల్లాల వారిగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news