మిర్యాలగూడలో ఎంపీ ఈటల రాజేంద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని.. టీచర్స్,లెక్చరలను ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు పార్టీలకు ఓట్లు అడిగే ముఖం లేదు. అభ్యర్థులను పెట్టే దమ్ములేదు. ఉద్యోగులు కల్పించే కంపెనీలకు రాయితీలు ఇస్తున్నారు. అబ్దుల్ కలాంను అవమానించిన అమెరికా స్థాయి నుండి మోడీ గౌరవించిన తీరుకు మనం చూస్తున్నాం. ఇది మోదీ విజయం. ఇప్పుడు స్కాములు లేవు. మంత్రులు జైళ్లకు పోవడం లేదు, సుపరిపాలన అందిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా కొన్ని సీట్లు ఇస్తే బాగుండు అనే భావన ప్రజల్లో బలంగా పెరిగింది. కాబట్టే.. మహారాష్ట్ర హర్యానా డిల్లీలో బీజేపీని గెలిపించారు.
టీచర్లకు అన్నివేళలా అండగా ఉన్నది బీజేపీ. 317 జీఓ కి వ్యతిరేకంగా కొట్లాడింది బీజేపీ. 317 జీఓ వల్ల టీచర్లు ఆత్మహత్యలు చేసుకున్నా కెసిఆర్ పట్టించుకోలేదు. పదవీవిరమణ డబ్బులు రావాలంటే 10 శాతం లంచం ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. దాచుకున్న డబ్బులు ఇవ్వమంటే దిక్కులేదు. ఐదు డి.ఏ లు పెండింగ్, 371 బాధలు పోలేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. విద్య నాశనం అయ్యింది. ప్రైవేట్ కాలేజీలో ఫీజు రీఎంబర్స్మెంట్ కెసిఆర్ మూడేళ్లు.. రేవంత్ ఇప్పుడు సంవత్సరన్నరగా పెండింగ్ పెట్టారు. డబ్బులు విడుదల చేయమంటే రేవంత్ సెటిల్మెంట్ కి రమ్మంటున్నారట. ఇంతకంటే నీచం ఏమన్నా ఉందా.. కాలేజీలు నడపలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే మూకుమ్మడిగా బీజేపీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు అని ఈటల అన్నారు.