ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో ఎన్నో మంచి విషయాలను చెప్పడం జరిగింది. వాటిని పాటించడం వలన ఎన్నో ఉపయోగాలను పొందవచ్చు. అయితే నీతి శాస్త్రంలో భాగంగా తల్లిదండ్రులకు పిల్లల గురించి ఎన్నో విషయాలను వివరించారు. తల్లిదండ్రులు పిల్లల ముందు ఎలా అయితే ప్రవర్తిస్తారో అదే పిల్లల జీవితం పై కూడా ప్రభావం పడుతుంది. కనుక తల్లితండ్రులు ఇటువంటి తప్పులను అస్సలు చేయకూడదు. ఈ చిన్న చిన్న తప్పులు వలన పిల్లలు జీవితం పై ప్రభావం ఎంతో ఎక్కువగా ఉంటుంది. కనుక ఏ సందర్భంలో అయినా ఈ తప్పులను చేయకుండా ఉండాలి.
సహజంగా తల్లిదండ్రులు పిల్లలను పెంచడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా కొన్నిసూచనలను మరియు జాగ్రత్తలను పాటిస్తూ వస్తారు. తల్లిదండ్రులు తెలియకుండా చేసే కొన్ని తప్పులు పిల్లల భవిష్యత్తును ఎంతో దెబ్బతీస్తాయి. కనుక మీరు ఈ తప్పులను అస్సలు చేయవద్దు. తల్లిదండ్రులు భాష ఎప్పుడూ మర్యాదపూర్వకంగా ఉండాలి. ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట తీరు సరిగా ఉండదో అదే అలవాటు పిల్లలకు కూడా వస్తుంది. అంతే కాకుండా చాలా శాతం తల్లిదండ్రులు పిల్లల పై అరుస్తూ ఉంటారు.
అలా కాకుండా ప్రేమగా మాట్లాడి వారికి కూడా అదే నేర్పాలి. సహజంగా ఇంట్లో ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా భార్య భర్తలు ఎప్పుడైతే పిల్లలు ముందు గొడవపడి గౌరవించకుండా వ్యవహరిస్తారో, అదే ప్రభావం పిల్లల పై కూడా ఉంటుంది. కనుక భార్య భర్తలు పిల్లలతో ఎంతో గౌరవంగా ప్రవర్తించాలి. అదే విధంగా పిల్లలకు అబద్ధాలు అస్సలు చెప్పకూడదు. తల్లిదండ్రులు పిల్లలకి అబద్ధాలు చెప్పడం వలన అదే అలవాటుగా మారుతుంది మరియు ఈ విధంగా ప్రోత్సహిస్తే పిల్లలు భవిష్యత్తు పై ఎంతో ప్రభావం ఉంటుంది. కనుక ఇటువంటి తప్పులను పిల్లల దగ్గర అస్సలు చేయకూడదు.