బీసీలలో మైనార్టీలను కలిపారు అని చెప్పడం సరికాదు : షబ్బీర్ అలీ

-

బండి సంజయ్, కిషన్ రెడ్డి లు బీసీ లకు అన్యాయం జరిగింది అంటున్నారు. కానీ బీసీలలో మైనార్టీలను కలిపారు అని చెప్పడం సరికాదు అని షబ్బీర్ అలీ అన్నారు. సాధారణ వ్యక్తి, చదువుకొని వ్యక్తి మాట్లాడితే.. వదిలేయొచ్చు. కానీ కేంద్రమంత్రులు మాట్లాడి.. చిచ్చు పెడుతున్నారు. కిషన్ రెడ్డి.. బండి సంజయ్ లకు పోస్టులో వివరాలు పంపిస్తున్న. హంటర్ కమిషన్..1882లో వేసింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. 1918 లో మిల్లర్ కమిషన్.. స్టడీ చేసింది. 1953 లో కాక కాలేకర్ రిపోర్ట్ లో కూడా కొన్ని కులాలు బీసీ జాబితా లో ఉన్నాయి.

ఇప్పటికీ వెనకబడిన మైనార్టీలను bc జాబితా లోనే ఉన్నాయి. బార్బర్.. వాషర్ మెన్… లాంటి వాళ్ళు వృతి సమానం. సుప్రీంకోర్టు కూడా ఇదే అంశం పై స్పష్టత ఇచ్చింది. 1970 లో మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికలో కూడా కొన్ని ముస్లిం కులాలు ఉన్నాయి. గుజరాత్ లో కూడా obc ముస్లింలు ఉన్నారు. కానీ ఎక్కడా లేదు.. తెలంగాణ లో ఉంది అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కమిషన్ ల నివేదిక పంపుతున్న. కేంద్ర మంత్రులే కదా… బీసీల జాబితాలో ఉన్న ముస్లింలను గుజరాత్ లో కూడా తొలగించండి అని సవాల్ విసిరారు షబ్బీర్ అలీ.

Read more RELATED
Recommended to you

Latest news