జడ్చర్ల ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఘటనలో 80 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి వద్ద ఉన్న ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ జరగ్గా..విషయం బయటికి రాకుండా డాక్టర్లను యూనివర్సిటీకి పిలిపించి వైద్యం అందించగా సిబ్బంది, విద్యార్థుల ఆరోగ్యం నయం కాలేదు. దీంతో ఈ విషయం బయటకు పొక్కినట్లు సమాచారం.
కేవలం 27 మంది విద్యార్థులకే అస్వస్థత అని నిర్వాహకులు తెలిపారు.కానీ ,దాదాపు 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది.అయితే, బయట ఫుడ్ తినడం వల్ల జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.కానీ, హాస్టల్ ఫుడ్ వల్లనే ఫుడ్ పాయిజన్ అయ్యిందని విద్యార్థులు స్పష్టంచేస్తున్నారు.