ఏపీ ప్రభుత్వం తెలంగాణ వాటా నీటిని తరలించుకు పోతుంటే సీఎం చంద్రబాబుతో మాట్లాడేందుకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వణుకు పుడుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎందుకంటే చంద్రబాబు ద్వారా పైరవీ చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుందామనే ఆలోచనతో ఆయనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎదురు మాట్లాడట్లేదని విమర్శించారు. బీజేపీని అడగడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి బీ టీం అని.. అందుకే చంద్రబాబుతో మాట్లాడే ధైర్యం అటు రేవంత్ రెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
https://twitter.com/TeluguScribe/status/1892825919120695325