కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే సరిగా లేదని, అది వాస్తవం కాదని విమర్శించారు.
ఇదే విషయమై కులగణన సర్వేలో పాల్గొన్న ఓ అధికారితో మాట్లాడితే ‘కులగణన సర్వే పై సరైన పర్యవేక్షణ లేదు, మా పైన ఉన్న అధికారులు మాకు సరిగ్గా కోఆర్డినేట్ చేయలేదు. వాళ్ళకి కులగణన సర్వేపై ఇంట్రెస్ట్ లేదు, త్వరగా కానివ్వండి, తూతూ మంత్రంగా ఎంతైతే అంత చేయండి అని చెప్పారని అన్నాడు’. కానీ, అదే 2014లో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఒక్కకుటుంబాన్ని కూడా మిస్ అవ్వకుండా సర్వే చేపించాడు అని మాజీ సీఎంను కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ మెచ్చుకోవడం సర్వత్రా చర్చకు దారితీసింది.
https://twitter.com/Nallabalu1/status/1893313544516706409