తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి… కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారట. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ… కానీ ఇవాళ నేరుగా ఫోన్ కాల్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నేపథ్యంలో… దాదాపు 50 మందికి పైగా కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారు.

ఈ విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ కాల్ చేశారు. ఈ విషయంపై ఆరా కూడా తీశారు. అయితే మోడీ రంగంలోకి దిగిన నేపథ్యంలో… కాస్త ఆలస్యంగా స్పందించారు రాహుల్ గాంధీ. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు.