కేసీఆర్, కేటీఆర్‌ను అరెస్టు చేయలేదని బండి సంజయ్ అడుగుతున్నాడు… అమెరికాలో ఉన్న శ్రవణ్‌రావు, ప్రభాకర్ ఎందుకు అరెస్టు చేసి తీసుకువస్త లేరు. శ్రవణ్‌రావు, ప్రభాకర్ రావును అరెస్టు చేసి తీసుకువస్తే కేసీఆర్, కేటీఆర్ ను ఎప్పుడు అరెస్టు చేస్తామో చెబుతాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక యమున నది ప్రక్షాళన చేస్తాం అని ఢిల్లీలో అధికారంలోకి వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన చేస్తాం అంటే మీరు అడ్డుకుంటున్నారు అని పేర్కొన్నారు.
ఇక హైదరాబాద్‌కు మెట్రో రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డినే. నా మీద కోపంతో హైదరాబాద్‌ను, తెలంగాణను అభివృద్ధి చేయకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. కేంద్రం నుంచి వచ్చే నిధులు అనుమతులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అని మీ మంత్రులు ఎంపీలు చెబుతున్నారు. అయితే ఇలా కిషన్ రెడ్డి ఎన్ని రోజులు మభ్య పెడుతారురు. మెట్రో రైలు, మూసి ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్డు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు నిధులు ఇప్పించు.. అప్పుడు ఓట్లు అడుగు అని పేర్కొన సీఎం.. హైదరాబాద్ అభివృద్ధికి అడ్డొచ్చి నోడిని తొక్కుకుంటూ అభివృద్ధి చేస్తాం అని తెలిపారు.