ఈ మధ్యకాలంలో దీర్ఘకాలిక సమస్యలలో డయాబెటిస్ సమస్య రోజురోజుకు పెరుగుతోంది అనే చెప్పవచ్చు. చాలా శాతం మంది వయస్సుతో సంబంధం లేకుండా డయాబెటిస్ తో బాధపడుతున్నారు. జీవన విధానాన్ని మార్చుకుని, రోజువారి ఆహారంలో మార్పులను చేసుకోవడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఈ చిట్కాలను పాటించడం వలన డయాబెటిస్ సమస్యను నియంత్రించవచ్చు. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు రాత్రి సమయంలో ఆహారాన్ని త్వరగా తీసుకోవాలి. ఎప్పుడైతే రాత్రి 7 గంటల లోపు తింటారో అప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు చెక్కర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి.
అదే విధంగా రోజువారి ఆహారంలో మార్పులను చేసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో స్నాక్స్ లో భాగంగా గింజలు, పెరుగు వంటివి తీసుకోవడం మేలు. దీనితో పాటుగా సాయంత్రం స్నాక్స్ తీసుకున్న తర్వాత కార్బోహైడ్రేట్లను అస్సలు తీసుకోకూడదు. ఈ విధంగా రాత్రి సమయంలో కార్బోహైడ్రేట్లకు బదులుగా ఇతర పదార్థాలను తీసుకోవడం వలన ఎంతో మార్పుని గమనిస్తారు. కేవలం ఆహరం మాత్రమే కాకుండా నిద్ర కూడా కీలక పాత్ర పోషిస్తుంది కనుక రాత్రి త్వరగా నిద్ర పోవాలి. ఇలా చేయడం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. చాలా శాతం మంది రాత్రి సమయంలో స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు.
ఎప్పుడైతే స్క్రీన్ వంటివి ఎక్కువ చూస్తారో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. ఈ విధంగా డయాబెటిస్ సమస్య కూడా పెరుగుతుంది. కనుక వీలైనంత వరకూ రాత్రి సమయంలో స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా ఉపయోగించవద్దు. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు తరచుగా వ్యాయామాలను చేస్తూ ఉండాలి. రాత్రి సమయంలో పడుకునే ముందు చక్కర స్థాయిలను పరీక్షించుకోవడం వలన మార్పులను ఎంతో త్వరగా గమనించి తగిన చర్యలను కూడా తీసుకోవచ్చు. దీంతో పాటుగా మెడికేషన్ కూడా ఎంతో సహాయం చేస్తుంది. కనుక డాక్టర్ సూచించిన మెడికేషన్ తో పాటుగా ఈ చిట్కాలను రాత్రి సమయంలో పాటించడం వలన డయాబెటిస్ సమస్యను తగ్గించుకోవచ్చు.