ఏపీ శాసన మండలిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వర్సెస్ మంత్రి నారా లోకేష్ మధ్య విభజన హామీలపై వాడి వేడిగా చర్చ జరుగుతున్నది.ఎన్డీయే కూటమిలో టీడీపీ, జనసేన కీలక భాగస్వాములుగా ఉన్నందున రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని బొత్స సత్యనారాయణ శాసన మండలిలో డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బొత్స ప్రశ్నలకు మంత్రి నారాలోకేష్ స్పందిస్తూ.. మేం కేంద్ర ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇస్తామని తెలిపారు.ఏపీ అభివృద్ధికి కేంద్రం సహాయం చాలా అవసరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని వక్రీకరిస్తూ, ఎగతాళి చేస్తూ మాట్లాడటం సరికాదని వైసీపీ నేతలకు మంత్రి లోకేష్ చురకలంటించారు.