వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే మహాశివరాత్రి జాతరకు దేశం నలుమూలల నుండి తరలివచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ సంఖ్యలో వచ్చే వాహనాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్స్, వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసేలా చూడాలని ఆయా ప్రాంతాల్లో విధుల్లో ఉన్న పోలీస్ అధికారులను, సిబ్బందిని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ఆదేశించారు.
అనంతరం ఆయన దేవాలయ పరిసర ప్రాంతాలను, దర్శన ప్రదేశాలు, ధర్మగుండం, శివార్చన జరిగే ప్రదేశం, క్యూ లైన్స్ ,గర్భగుడి పరిసర ప్రాంతాలను పరిశీలించి ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బంది కి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, పలు సూచనలు సలహాలు చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ ఇన్ స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్.ఐ రాజు, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.