నందిగామలో వంద పడకల ప్రభుత్వ వైద్యశాల రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు అని ఏపీ మంత్రి సత్య కుమార్ తెలిపారు. అయితే కోర్టులకు వెళ్లి మరి వంద పడకల వైద్యశాల నిర్మాణాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు అని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లేనా పేదలకు న్యాయం చేసేది అని ప్రశ్నించిన మంత్రి.. గత ఐదేళ్లు ఆసుపత్రి నిర్మాణం గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు అని స్పష్టం చేసారు.
అలాగే కూటమి ప్రభుత్వం రాగానే స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వైద్యశాల నిర్మాణానికి ప్రభుత్వాన్ని తనను కోరారు. ఈ మేరకు వంద పడకల వైద్యశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశాం అని శుభవార్త తెలిపారు. ఈ ఎన్నికల కోడ్ ముగిశాక 100 పడకల వైద్యశాల భవన నిర్మాణానికి టెండర్లు పిలుస్తాం అన్నారు. అదే విధంగా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేసి తీరుతాం పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందజేస్తాం అని పేర్కొన్నారు మంత్రి సత్య కుమార్.