ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభమేళాలో పని చేసిన పారిశుధ్య, ఆరోగ్య కార్యకర్తలందరికీ రూ.10వేలు బోనస్ ఇవ్వనున్నట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఏప్రిల్ నెలలో ఉద్యోగుల ఖాతాల్లో ఈ డబ్బు జమ అవుతుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో పాటు వారికి రూ.5లక్షల ఆరోగ్య బీమా మొత్తాన్ని కూడా అందిస్తామన్నారు. జనవరి 13న ప్రారంభమైన అతిపెద్ద ప్రపంచ ఆధ్యాత్మిక ఉత్సవం మహాకుంభమేళా 45 రోజుల పాటు సాగి మహాశివరాత్రితో ముగిసింది.
ఆ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించే పనిలో పడ్డారు అధికారులు. యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలు బ్రజేష్ పాఠక్, కేపీ మౌర్య, మంత్రివర్గంలోని ఇతర మంత్రులు కూడా ఆ ఘాట్ల వద్ద స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. నీటిలో వ్యర్థ్యాలు తొలగించడంతో పాటు.. చీపురు పట్టి కాసేపు రోడ్లు శుభ్రం చేశారు. ఘాట్లన్నీ పరిశీలించి మొత్తం శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. అరేల్ ఘాట్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. పారిశుధ్య కార్మికులతో కలిసి ఆయన భోజనం చేయడం విశేషం.